ప్రీతీ -భీతి ..!!:-----ఎస్.హన్మంతరావు- విశాఖపట్నం.
మిక్సీ కొంటాం..
దానికి కవరేస్తాం!

టీవీ కొంటాం..
దానికి కవరేస్తాం!

బైక్‌ కొంటాం..
దానికి కవరేస్తాం!

కార్‌ కొంటాం..
దానికి కవరేస్తాం!

లాప్‌టాప్‌ కొంటాం..
దానికి కవరేస్తాం!

సెల్‌ఫోన్‌ కొంటాం..
దానికి కూడా కవరేస్తాం!

కానీ,
పోతావు అన్నాక కూడ,
ముక్కుకీ మూతికీ కవరెయ్యం...!

మనకి ప్రాణభీతికంటే -
వస్తుప్రీతెక్కువ....!!

           

కామెంట్‌లు