వార్తాహర-వాయునందన:-వరుకోలు లక్ష్మయ్య-సిద్ధిపేట
*1కం.*
హనుమని నిత్యము గొలువగ 
తనువున భయమెల్లబాసిధైర్యము కలుగున్!
జనమానసపులకింతల 
వినుమా భక్తాళి మొరలవినయముతోడన్!
2కం.
ప్రొద్దున నిద్దుర వీడుచు
శుద్ధిగ మిముపూజచేయశుభములు కలుగన్!
విద్దెలు బుద్ధుల నిమ్మా!
వద్దనకంజలిసుపుత్రవాయుకుమారా!
3కం.
నమ్మిన బంటువు నీవన 
అమ్మా సీతమ్మజాడనంతవెదక మో!
దమ్మున దక్షిణ దిక్కున
కొమ్మనులంకంతవెదికికొనితెచ్చితివే! 
4కం.
తోకన దనుజులు నిప్పును  
ప్రాకటముగ పెట్టినంతభళిరా! యనుచున్! 
సోకున లంకను కాల్చుచు
మీకికనాశనమటంచుమేల్కొల్పెగదా!
 *5కం.*
బంగరుటుంగర మిచ్చుచు 
బంగారపుసీతవార్తబహుమానముగా!
శృంగారరాముతెల్పెద;
కంగారునువీడుమనుచుకైమోడ్పులిడెన్!