*జయహో ఝాన్సీ*:-మంజీత కుమార్--*బెంగుళూరు
ఆమె రగిలే అగ్ని కణిక
ఆమె ఎగిసే సముద్రపు అల

బాల్యం నుంచి అపార ధైర్యసాహసాలు
ఉగ్గుపాలతో నేర్చిన దేశభక్తి

శత్రువులను వణికించే ధీశాలి
కత్తి పడితే అపర కాళీ

అడుగడుగునా శత్రు సైన్యం
బిడ్డను కొంగున కట్టి యుద్ధం

ఝాన్సీ రాణిగా ఎదిగిన మణికర్ణిక
మహిళా జాతికి ఆశా కిరణం

ఫిరంగిలకు చుక్కలు చూపిన తెగువ
దేశ పౌరులకు ధైర్యం నూరిపోసిన మగువ

మహిళల్లో చైతన్యం తెచ్చి
యువతలో స్వాతంత్ర్య కాంక్షను రేపి

ఛత్రపతి శివాజీ స్ఫూర్తిగా
నవ సమాజ స్థాపనకు అడుగులు

సింహాసనం ముఖ్యంకాదన్న మహారాణి
ప్రజల క్షేమమే చాలన్న నారీ శిరోమణి

భరతమాతకు నువ్వు గర్వకారణం
అయ్యావు అందరికీ స్పూర్తిదాయకం