ప్రవేశ పరీక్ష ..!!: -------డా .కె.ఎల్.వి.ప్రసాద్. హన్మ కొండ
మిత్రులు 'లైక్'లు
చాలా సులభంగా
కొట్టేస్తారు,కానీ
ఎందుకు కొడుతున్నారో
చెప్ప రు!
పోస్టింగ్ లు
బ్రహ్మాండంగా పెట్టేస్తారు,
సందర్భం 
ఏమిటో చెప్పరు!
ఇతరుల పోస్టింగుల్లో
తల దూరుస్తారు,
చేస్తున్నది తప్పని
తెలుసుకోరు!
ఇతరుల బొమ్మలు
తమవి అన్నట్టు
పోస్ట్ చేస్తారు,
కర్టెసి కయినా,

అసలు వాళ్ళ -

పేరు రాయరు..!

పేస్బుక్ మెంబెర్ కు
ప్రవేశ పరీక్ష
పెడితే బావుణ్ణు!!

.

కామెంట్‌లు