ఎవరికోసం ..?:---కె.ఎల్వీ--హనంకొండ.
ఇంట్లోనే ఉండాలి 
బయటికి ....
వెళ్లకూడదు ....!

గంపులుగా ...
తిరగకూడదు ...
ఎడం ..ఎడంగా ,
భౌతిక దూరం 
పాటించాలి ...!

ఎప్పటికపుడు ,
చేతులు 
సబ్బుతో _
కడుక్కొవాలి ...!

ఆవిరి పీల్చాలి ...
వేడినీళ్లు తాగాలి ,
మాంసాహారం 
తగ్గించాలి ....
మధుపానం 
త్యజించాలి !

ఎవరికోసం _
ఇవన్నీ ,
ప్రధాన మంత్రికోసమా ?
ముఖ్య మంత్రికోసమా ?
ఆరోగ్య మంత్రులకోసమా ?
ఆకాశవాణి కోసమా ?
దూరదర్శన్ కోసమా ?
వైద్యుల కోసమా ?
నర్సులకోసమా ?
పోలీసుల కోసమా ?
పారిశుధ్య పనివారికోసమా ?

ఆలోచించిచూడు 
మిత్రమా ....
ఎవరికోసం ఇవన్నీ ?
ఇప్పటికయినా తెలుసుకో ...
ఆత్మ విమర్ష చేసుకో,
ఇవన్నీ __
నీకోసం _నాకోసం ,
మనందరికోసం !
మన  ఆరోగ్యసమాజం కోసం!!


కామెంట్‌లు