"సమ్మెట ఉమాదేవి కథానికలు" :-కూకట్ల తిరుపతి, కరీంనగర్.


 సమ్మెట ఉమాదేవి గారు చేయి తిరిగిన కథా రచయిత్రి.  ఆదివాసీ బిడ్డలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన విశిష్ట ఉపాధ్యాయిని. ఈమె సాహితీ గుమ్మంగా ప్రసిద్ధి చెందిన ఖమ్మం జిల్లా బిడ్డ. సమస్యలకు ఎదురొడ్డి నిలిచి గెలిచిన జీవితాలనే ఇందులో 14కథలుగా పొందుపరచారు. అన్నీ మానవతా పరిమళాలను పంచేవే. మనిషితనాన్ని పేంచేవే. ఆధునిక సమాజానికి అద్దం పట్టేవిధంగా, వాస్తవిక దృక్పథంతోనే కథలు రాశారు. ఈమె ఇప్పటికే "రేల పూలు" తండావాసుల కథలు, "అమ్మ" కథలు, "జమ్మిపూలు" కథానికలు వెలువరించారు. "మా పిల్లల ముచ్చట్లు" ఒక టీచరు అనుభవాలు, "నాల్నాలుగుల పదహారు" నలుగురు కథకుల పదహారు కథలు తీసుకొచ్చారు. బాల సాహిత్యంలో "పిల్లల దండు", "పిల్లి ముసుగు", "అల్లరి కావ్య", "నిజాయితీ", "పిల్లల బొమ్మల శ్రీ రామకృష్ణ పరమహంస" మొదలైన పొత్తాలను అచ్చేశారు. తెలుగు సాహిత్యాన్ని సంపద్వంతం చేస్తున్న సమ్మెట ఉమాదేవక్కకు అభినందన మందార మాలలు.