బహుజనులకు బాసటై
భాస్కరుడుగా నిలిచి
బడుగు జాతులందరిని
వెలిగించెను తలచి
రక్షకుడైన రారాజు
భారతీయ దృవరాజు!
నీళ్ల నంట నీయనట్టి
నీడ చేరనీయనట్టి
మూర్ఖత్వపు గిరిగీసిన
కులీన సంస్కృతిని చుట్టి
కుసుమించిన ధీరుడు
భరత జాతి రక్షకుడు
కంచెలు దాటనీయని
అఘాయిత్యాలను
బతుకే చావుగ మారిన
భాంచెన్ బతుకులు చూసెను
కనిపించె దెబ్బలకు చింతించె
కనిపించని కులం చేసిన
నిలబడ లేనట్టి వైన
పొగచూరిన బతుకులకు
మోకాళ్ళ పై నిలవగ
మొహమాటం లేనోళ్ళకు
బాధపడుతు పసినాడు
యెదిరించిన రత్నగిరి రత్నమా!
వెలియైన చోటనే
వేకువను రగిలించే
మనిషి ముసుగు నున్న
తోడేళ్ళను శిక్షించే
చట్టాలకు ఊపిరైన
దయార్ద్ర హృదయుడు!
చేతనత్వం లేనట్టి
జాతి జనుల జీవనాన
వెలుగు పూలు పూయించే
విశ్వాసమాయె జగాన
తరంగమై,విహంగమై
భరత జాతి వీర సింగమై నిలిచెను
మాయదారి గోడలను
కాలరాయ కలగన్నడు
మదాంధుల కర్కశత్వం
తుడి చేయగ పూనిండు
నిజమే మన అంబేద్కర్!
సామాజిక సూర్యుడు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి