దారిలో కరుణ(బాల గేయం)-ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
ఓ చిన్నారి తల్లు ల్లారా
మీ పయనం ఎక్కడికి చెప్పమ్మా
దారిలో కరోనా పురుగున్నది
దానికి మీరెదురెల్ల కండి

గుంపులు గుంపులుగా రాకండి
ఒక్కొక్కరు దూర  దూరంగా
దారిలో మీరు నడవండి
దానికి మీరు దొరుకొద్దండి

సమూహ సభలు వద్దండి
సందడి మీరు చేయొద్దు
కంటికి కానని పురుగండి
ఒంటిలో కొచ్చి చేరునండి

చిన్నా పెద్దా తేడా లేదండి
అందరిని చుట్టూ చుట్టేస్తుంది
ప్రతిఒక్కరు మాస్క్ పెట్టండి
అందరు జాగ్రత్తగా ఉండండి


కామెంట్‌లు