స్త్రీ మనసు:-- యామిజాల జగదీశ్

 అది రద్దీగా ఉన్న చీరల దుకాణం.
గంటన్నర నుంచీ చీరలు చూస్తూనే ఉంది మధుమతి. 
సేల్స్ గర్ల్ "మేడమ్, మీకీ బ్రౌన్ కలర్ చీర చాలా బాగుంటుందండి" అంది మధుమతితో. 
"అంతేనంటావా, అయినా ఆ పై ర్యాక్ లో రెండో వరుసలో కింద నుంచి నాలుగో చీర ఆ చిలక పచ్చ రంగు చీర తీయవా" అన్న మధుమతి ఆ అర్వాత కూడా కనీసం ఓ పది పన్నెండు చీరలు వేయించింది. ఇప్పటివరకూ ఆమె చూసిన చీరలు బల్లమీద కొండల్లే కనిపిస్తోంది. 
చివరకు మధుమతి ఆ "చీరల కొండ"లో మొట్టమొదటగా చూసిన ఓ చీర తీసుకుని బిల్లు వెయ్యమని సేల్స్ గర్ల్ కి ఇచ్చింది. 
ఆమె బిల్లు రాస్తుంటే మధుమతి పక్కనున్న భర్త చెవిలో "నేను కొన్న చీర కన్నా ఆ సేల్స్ గర్ల్ కట్టుకున్న చీర బాగుంది కదండీ" అని మెల్లగా చెప్పింది.