దృశ్యం ___పిల్లల కథ *:: ---డా. కె.ఎల్.వి.ప్రసాద్.

 సరిగ్గా ఉదయం పదకొండు గంటలు అయింది .
కాంటాక్ట్ ఫామ్ లో ,చెప్పినట్టుగా ,రాహుల్ ఉరఫ్ 
చంటి ,వాళ్ళనాన్న చంద్రం ,ఆ ..సమయం లో 
ఆకాశవాణి ,విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో 
అడుగుపెట్టారు.
గేటుదగ్గర రక్షక భటుడి వేశంలో ఉన్న వ్యక్తి ఈ 
తండ్రి _కొడుకులను ,ఆగమన్నట్టు సైగ చేసి ,ఎందుకు 
వచ్చారన్నట్టు ,ముఖాభినయం చేశాడు .
చంటి తన సంచిలో ఉన్న అనుమతి పత్రం తీసి 
చూపించాడు .గేట్ మేన్ అది చూసి అత్మీయంగా 
నవ్వి ,లోపలికి వెళ్ళమన్నట్టుగా ,లోపలికి దారి 
చూపించాడు.మాటలు _ పాటలు ప్రసారం చేసే ...
ఈ రేడియో కేంద్రంలో ,ఈ ముఖాభినయం ఏమిటో 
అనుకున్నాడు చంటి .
లోపలికి చేరుకోగానే ,ఒక వ్యక్తి నవ్వుతూ " మీకు 
ఎవరు కావాలి ?"అని అడిగాడు.ఇప్పుడు ముఖాభినయం చేయడం చంటి వంతు అయింది .
అతను ఒక గదిలోనికి దారి చూపించాడు .ఆ గదికి బయట 'డ్యూటీ ఆఫీసరు 'అని బోర్డు ఉంది .లోపలి 
కి ,వెళ్ళి ..ఆయనకు నమస్కరించి ,విశయం 
చెప్పగానే ,ఆయన ఎవరికో ఫోన్ చేసి ఇంకొక గది 
లోకి పంపించారు .ఆ గది బయట "ప్రొగ్రామ్ ...
ఎగ్జికుటివ్ " అని బోర్డువుంది .లోపలి కి వెళ్ళి 
అక్కడ కూర్చున్న పెద్దాయనకు ,తండ్రీకొడుకు లిద్దరు 
నమస్కరించారు.ఆయన వీరిద్దరినీ కూర్చోబెట్టి ,
ఇంకెవరినో పిలిచి ,వీరిద్దరిని అప్పగించారు .ఆ ..
తరువాత వాళ్లకి తెలిసింది ,ఆయన ' ప్రొగ్రామ్ అసిస్టెంట్ ' అని.
ఆయన వీళ్ళిద్దరినీ ఒక విశాలంగా ఉన్న గదిలోకి 
తీసుకువెళ్లాడు .చంటి ఎప్పుడూ అలాంటి గదిని చూడలేదు .బయట ఆగదికి ' స్టుడియో 'అని బోర్డు 
రాసివుంది.గదిలోపల మరో గది ఉంది .చంటి తండ్రిని ముందు గదిలో (రికార్డింగ్ రూం )లో ఉంచి 
చంటిని లోపలిగది లోకి తీసుకెళ్లారు .ఆ గ ది 
మద్యలో గుండ్రటి బల్లవుంది .బల్లకు ఎదురెదురుగా 
కూర్చోడానికి ,రెండు కుర్చీలున్నాయి .బల్లమీద 
రెండు మైక్ (మౌత్ పీసులు )లు ఉన్నాయి .గది అంతా ,ఏసీ,  వల్ల చల్లగ ఉంది. చంటిని 
ఒక కుర్చీలో కూర్చోబెట్టి ,చంటి రాసుకువెళ్లిన ' విశాఖలో చూడఁదగ్గ ప్రదేశాలు ' అనే వ్యాసం రికార్డు 
చేశారు .చంటి కి సంతోషంగానూ ,గర్వంగానూ 
ఉంది .
నిద్రలో చంటి ...'ఆకాశ వాణీ ..విశాఖపట్నం కేంద్రం '
అని కలవరిస్తున్నాడు.వాళ్ళమ్మ నిద్రలేపి ," ఏమిటి 
నాన్న ..కల వచ్చిందా ?రేడియో కేంద్రం చూస్తావా ?
రేపు తీసికెళ్ళి నీకు చూపిస్తానుగా " అంటూ వీఁపు నిమిరింది.చంటి సంతోషంగా మంచం దిగాడు.

కామెంట్‌లు