కునుకు తీసిన చినుకు(బాల గేయం ):--ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
చినుకు కునుకు తీసింది
గాలి వచ్చి మేల్కొలిపింది
చినుకు కళ్ళు తెరిచింది
గబగబా తెప్పల్లో చేరింది

నేల తల్లిని చూసింది
కిలకిల మేఘము నవ్వింది
చిటపట చినుకులు రాల్చింది
అవణి తల్లిని తడిపింది

జడి వానై కురిసింది
వాగులు వంకలు పారాయి
చెరువులు కుంటలు నిండాయి
వానమ్మ చూసి నవ్వింది

ప్రకృతిమాత మురిసింది
పచ్చల హారం వేసింది
పంటలు బాగా పండాయి
కరువు లన్ని తీరాయి