ఉగాది పండుగ -బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
ఉగాది పండుగ వచ్చిందోయ్ 
హుషారులెన్నో తెచ్చిందోయ్ 
మామిడాకుల తోరణాల పని 
మనకే అప్పజెప్పిందోయ్!

మామిడి పిందెలు,వేపపూతకి 
మామయ్యల తో వెళ్ళాము 
పూల తోటలో బుట్టనిండుగా 
పూలకానుకలు తెచ్చాము!

తలకు స్నానము క్రొత్త బట్టలు 
ధరించి పూజలు చేసాము 
అమ్మ చేసిన ఉగాది పచ్చడి 
అమృతమల్లే తిన్నాము !

పండుగలంటే కాల చక్రం 
గతులు తెలిపే విధానం 
దండగ చేయకు సమయమంటూ 
హెచ్చరికలు అనుకుందాము!


కామెంట్‌లు