అమ్మ దాగుంది : ----కిలపర్తి దాలినాయుడు

ఈ పూల చెట్టులో
అమ్మ దాగుంది
అమ్మ దాగుంది
మా కొమ్మ దాగుంది

నా జడలో పూలను
తురుముతానంది
నా ముఖాన్నాకుతో
ముద్దు పెట్టింది
తననీడ గొడుగా పట్టింది అమ్మ
అమ్మంటే పలుచేతులున్నట్టి కొమ్మ
వేరు నేలకు పంపి నీరు తీసింది
తాను నింగికి తాక పైకి ఎదిగిగింది
చుక్కలను పూలుగా తురిమింది అమ్మ
నా బుగ్గపై చుక్క పెట్టింది కొమ్మ!
నేలప్రగతికి తాను చాచింది కొమ్మ