*ఖ్యాతి*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 శ్రీ మహావిష్ణువే దశరథరాజుకు
మానవుడై శ్రీరాముడుగ జన్మించాడు
తండ్రి ఆనతితో శ్రీరామచంద్రుడు
సతీ, సోదరుడు వెంటరాగా కానలకెళ్ళాడు
దుష్టులైన బహు రక్కసుల దునిమి
శిష్టులందరిని దయతో రక్షించాడు
తండ్రి అంటే రామయ్యతండ్రి అని
జగాన ఖ్యాతిని పొందాడు
మహాలక్ష్మియే సీతమ్మతల్లిగా పుట్టీ
జనకుని సుత అయిన గారాలపట్టీ
ముద్దులగుమ్మా సీతమ్మా
బంగరుబొమ్మా సీతమ్మా
మిథిలాపురము చేపట్టీ
సిరుల రాముని చేయిపట్టీ
ఘన గుణముల పుణికిపట్టీ
సకలసంపదలు పురమున వదిలీ
అడవికి అయినా మగనితొ నడిచీ
శీలపరీక్షకు ఎదురుగ నిలిచీ
నిప్పులనుంచీ నవ్వుతు వచ్చీ
తల్లి అంటే సీతమ్మతల్లి అని
జగతిన పేరు వడిసిందండీ
సీతారాములు ఆదర్శదంపతులై
ఇల ఖ్యాతి గాంచారు !!

కామెంట్‌లు