ద్యేయం .....!!:-------డా.కె.ఎల్.వి.ప్రసాద్- హన్మ కొండ .
నావాళ్లు 
నాపూర్వికులు 
బాధ్యత మరిచారు 
క్షణికమైన అవసరాలకు 
స్వార్దభరిత ఆలోచనలతో 
వృక్ష సంపదను ----
కొల్లగొట్టారు ,
మొక్కలు నాటటం
మరిచారు

వాతావరణ కాలుష్యానికి 
ప్రాణం పోసారు ....
సహజ ఆమ్లజనికి 
గండికొట్టారు ....
నా ..నడ్డికి 
సిలిండర్ తగిలించారు !
నాకిప్పుడు-
నా బాధ్యత బాగా తెలిసింది ,
జరిగిన పొరపాట్లు 
పునరావృతం -
కాకూడదన్నది మనసు ,
మొక్కనాటమన్నది ,
నా  వయసు ....!
అదే ద్యేయంతో 
ముందుకి పోతానని ...
మీ ..అందరికి తెలుసు ..!!

            

కామెంట్‌లు