కమలమ్మత్త వచ్చింది
కుమ్మరి వాము కెళ్ళింది
కుండ ఒక్కటి తీసుకుని
ఇంటి కామే వచ్చింది
పెరటి లోకి వెళ్ళింది
గుమ్మడి పండు తెపింది
దేవుని ముందు కొట్టింది
ముక్కలు బాగా కోసింది
బెల్లం తెచ్చి కలిపింది
పాయసమేమొ వండింది
కంచాల్లో నా పెట్టింది
అందరి చేతికి ఇచ్చింది
కమ్మగా మేము తిన్నాము
వొంటి లో బలము వచ్చింది
కంటిచూపు పెరిగింది
ఎంతో హాయిగున్నాము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి