ఇద్దరు మిత్రులు : --------డా . కె . ఎల్ . వి . ప్రసాద్ హన్మకొండ .

 రాజు-రాము మంచి స్నేహితులు . ఇద్దరూ కలసి బడికి వెళతారు ,కలిసి ఆడుకుంటారు ,కలిసి ఆడుకుంటారు . వీళ్లిద్దరి స్నేహం గురించి ,రాజు,రాము ,ల తల్లిదండ్రులకు 
బాగా తెలుసు . వాళ్ళ అభిరుచుల గురించి ,తినే తిళ్ళు గురించి మంచి అవగాహన వుంది . ఎవరి ఇంట్లో ఏ పిండి వంట చేసినా ,అది ఈ ఇద్దరికోసం ఎదురు చూస్తుంటుంది . 
సెలవుల్లో ఎక్కడికి విహార యాత్రలకు ,వెళ్లినా ,గుడులూ -
గోపురాలు దర్శించాలన్నా ,రెండు కుటుంబాలూ ,వాళ్ళ అనుకూలాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు . రాజు తండ్రి డాక్టరు ,తల్లి లెక్చరర్ . రాము తండ్రి స్కూల్ టీచర్ ,తల్లి 
గృహిణి . అయినా ఆ కుటుంబాల మధ్య ఎలాంటి హెచ్చు-తగ్గులూ లేవు . వాళ్ళ స్నేహాలూ -అనుబంధాలూ 
డబ్బుతోనూ ,హోదాతోనూ ,ముడిపడి లేవు . పిల్లలతో పాటు 
పెద్దలుకూడా ,ఎంతో స్నేహంగా -అన్యోన్యంగా ఉండేవారు . 
ఆ కుటుంబాల స్నేహానికి ,డబ్బు ,కులం,మతం ,ప్రాంతం,
ఏదీఅడ్డువచ్చేది కాదు.అందుకే పిల్లలుకూడా ఏంతో కలసి మెలసి ఉండేవారు.
అయితే ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది.ఆ..రోజు ఆదివారం,సాయంత్రం పూట ఆడుకోవడానికని వాళ్ళ ఇళ్లకు 
దగ్గర లోనే వున్నఆటస్థలానికి ఆదుకోవడానికి వెళ్లారు.వీళ్ళిద్ద
రూ మిగతా స్నేహితులతో కలసి ఆడుకుంటున్న సమయం
లో,అనుకోకుండా రాజు ఒక బండ రాయిమీద పడిపోయాడు.
రాజు ముందరిపన్నువిరిగి,పంటి చిగురు చితికి రక్తం విపరీ--
తంగా కారిపోవడం మొదలు పెట్టింది .అదిచూసి మిగతావా-
పిల్లలు భయపడి అక్కడినుండి పారిపోయారు .ఇక అక్కడ 
రాజుతో రాము ఒక్కడే మిగిలి పోయాడు . రాజు పరిస్థితిని చూసి రాము తల్లడిల్లిపోయాడు . ఒకటే ఏద్వడం మొదలు 
పెట్టాడు . రాజుకు ఏమీ అర్ధం కావడం లేదు , అంతా అయో
మయ స్థితిలో వున్నాడు . ఒక పక్క పంటి నొప్పి ,మరోపక్క రాము ఏడుపు ,ఏమి జరిగిందో తెలియని పరిస్థితి . రాజుకు 
తనవల్ల దెబ్బతగిలిందని రాజు తల్లి దండ్రులు అనుకుంటా
రెమో అన్నది రాము భయం . ఇలా ఉండగా ,అప్పుడే అటుగ
వాకింగ్ కోసం వచ్చిన పెద్దాయన ,రాముని విషయం అడిగి తెలుసుకుని ,రాజు పంటి నుండి రక్తం రాకుండా ,చేతిరుమా
లు మడిచి ,పళ్ళమధ్య నొక్కి పెట్టమని చెప్పి ,ఇద్దరినీ తీసుకుని ,రాజు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు పెద్దాయన . రాజువాళ్ళ మమ్మీని చూడగానే ,’’ ఆంటీ .. నేను
కాదు ,ఆంటీ .. ‘’అంటూ  ఏడవ డం మొదలు పెట్టాడు రాము
విషయం తెలుసుకున్న రాజు తల్లి దండ్రులు రామును ఎత్తుకుని ముద్దాడి కళ్లనీళ్లు పెట్టుకున్నారు . ఇది రామును ఆశ్చర్య పరిచింది . రాజు తల్లిదండ్రులు తనని తిడతారేమోనని భయపడ్డాడు . రాజుకు దెబ్బ తగిలినప్పుడు 
అందరూ రాజును వదిలివెళ్ళినా ,రాము అతడిని వదలకుండా ,అతనితోనే వున్నందుకు ఎంతగానో సంతోషిం
చారు . వాళ్ళ స్నేహాన్ని హృదయపూర్వకంగా అభినందించా
రు . ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ,రాజు పంటి చికిత్సకోసం వాళ్ళ డాడీ ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టారు . పది రోజుల తర్వాత రాజుకు పన్ను విరిగిన లక్షణాలే కనపడలేదు . ఆ .. అద్భుత చికిత్సకు ,రాము -
అతని తల్లిదండ్రులు కూడా ఆశ్చర్య పోయారు . 
         
                     -