శతక కర్త! ఆడెపు చంద్రమౌళి!': --సుజాత.పి.వి.ఎల్.


 ఆడెపు చంద్రమౌళి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లు జిల్లా కు చెందిన కవి. 1939 ఏప్రిల్'7 న జన్మించాడు. పద్య సాహిత్యంలో విశేష కృషి చేశాడు. రామాయణ రమణీయం, వేములవాడ రాజరాజేశ్వర శతకం, శ్రీశ్రీనివాస బొమ్మల శతకం ఇతని రచనలు. ఇతను రచించిన శ్రీశ్రీనివాస బొమ్మల శతకంలోని పద్యాలను తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రచురించిన 7 వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సాహిత్యంలో పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాను పొందాడు. ఇతని రచనలను టి.శ్రీరంగస్వామి ఆధ్వర్యంలో నడపబడుచున్న వరంగల్ వారి శ్రీలేఖ సాహితి సంస్థ పద్య మణిహారం పేరుతో 2012లో ప్రచురించింది. కవిత, కథ, నవల, పద్యం ఇలా సకల అక్షర కృతుల రూపాలు ఏవైనా వాటి పరమావధి మనిషిని ఉన్నతీకరించడమేనని తెలియచెప్పిన శతక వచన కవితా శశాంకుడు ఆడెపు చంద్రమౌళి. సమాజ హితాన్ని ఆకాంక్షించేదే శతక సాహిత్య ప్రధాన విధి. తన రచనల్లో లయాత్మక చందస్సుతో పాటు ప్రాణసమమైన శబ్ధ సౌందర్యం ప్రతీ పద్యంలోనూ స్పష్టంగా అగుపిస్తుంది. "భరత వీర లెమ్ము భవిత గనుము" అనే మకుటంతో ఆయన రాసిన 'భరత వీర శతకము' లో 108 పద్యాలున్నాయి. ప్రతి పద్యము ఆణిముత్యమే.!

( ఏప్రిల్'7,కవి ఆడెపు చంద్రమౌళి గారి జయంతి.)