కల వరం : :--లీలా కృష్ణ.తెనాలి.
అలా ఎలా.. నిశిరాతిరిలా..
నానయనాన ... ఓ చిలిపి కల... 
నే వద్దన్నా వినకుండా..
నన్నల్లుకు పోయెను మల్లికలా.

గోపయ్యను కాంచిన గోపికలా..
ఉవ్వెత్తున ఎగిసెను... చాంగుభళా.

పరువం పొందిన  శిల్పంలా..
కుబుసం విడిచిన సర్పంలా..
నవ నాట్యం చేసెను.. నర్తకిలా.

కను తెరిచినచో.. నను వీడునుగా..
కను తెరవనిచో.. కల ఆగదుగా.

తన కలవరమే, నను వీడని వల..
నను కవ్వించెను.. రసమయ కవితలా.

వ్యూహం ఎరుగని అభిమన్యుడిలా..
నా దేహం తనదయ్యెను, నిలువెల్లా.

ఏమార్చెను.. నను నే మరిచేలా..
ప్రసరించెను నాలో .. రవి కిరణంలా.

 మణిమాణిక్యాలతో.. నాకిక పని లేదు కదా .
తన మాటల ముత్యాలకు... నేనే మహరాజు సదా.

రాముడు  అనుకోలేదు, జానకి పతి కాగలడని ఏనాడు...  
ఆ రంగుల హరివిల్లే ... నా జత కూడెనని, కలగనలేదు.. మునుపెన్నడు.