పుస్తకం (కైతికాలు) :--రమేశ్ గోస్కుల కైతికాల రూపకర్త
హితులను మించిన నేస్తం
లోన దాచి సమస్తం 
జ్ఞాన జ్యోతులెలిగించి
గణత గలిగిన హస్తం
నిజమే కదా పుస్తకం
తొలగించును మస్తకం

రాజు పేద తేడాలు
చూపించని గమనం
కోరుకుంటే మదిలో
కలిగించును చలనం
జయజయహే పుస్తకం
జగమంత విఖ్యాతి

కష్టానికి సలహాలు
నష్టానికి ధైర్యాన్ని
ప్రశ్నల సమాధానం
అలసటకానందాన్ని
అందించే జగద్గురు
అందమైన అందరి పుస్తకం

నిధిలాగ వెలుగు దాచి
నిత్యం మన నెలిగించి
నివురుగప్పిన నిప్పులా
నిజాలను లోన దాచి
దివ్వెలాగ వెలుగు లీను
దేహదారి పుడమిని



కామెంట్‌లు