కంకణం కట్టుకున్నవే
మానవజాతి నంత
కాష్టానికి పంపే దానికి
మాతో పాటే సహజీవనం
నీతో పాటే మా జీవితం
ప్రతి నిమిషం నీవేనమ్మా
ఏ తోడు లేకుండా…
ఏ నీడ లేకుండా…..
ఏ గూడు లేకుండా...
ఏ ఉపాధి లేకుండా…
వయసుతో నిమిత్తం
లేకుండా….??
స్టే హోం స్టే సేప్
వర్క్ ఫ్రం హోమ్
అనేలా చేసుకున్నవే!!
పరీక్షలు లేవు టెన్షన్స్ లేవు
తరగతి గదులు ఖాళీ
గడిచిన అకాడమిక్ ఇయర్
తెలియకపోతే….!!
చదవని చదువుకు
నేర్వని జ్ఞానానికి
నేర్చుకున్న జ్ఞానం
ఎంతంటే
ఏం చెప్పగలరు….??
పరీక్షలే లేకుండా
పై తరగతులకు
సాగిపోతుంటే ఇక
పరీక్షల తో పనేంటి
కరడుగట్టిన కరోనాకు
జవాబు చెప్పడం తప్ప…!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి