జిట్ట పులి(బాల గేయం):--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
జిట్ట  పులి  ఒక్కటి
చిట్టడవికి వచ్చింది
జింక నేమొ పట్టింది
పొట్ట నిండా మెక్కింది

మత్తుగా ఉన్నది
గుర్ర మొకటి వచ్చింది
డొక్కలోన తొక్కుతూ
పెక్క పెక్క తన్నింది

మత్తులున్న జిట్ట పులి
తిన్న దంత కక్కింది
గాండ్రించి అరిచింది
అటూ ఇటూ బొర్లింది

లేవడానికి చూసింది 
లేవలేక పోయింది
గుర్రం చూసి నవ్వింది
పరుగు తీసి ఉరికింది