కొయ్య గుర్రం -(బాల గేయం)-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
పుట్టినరోజుకి 
కొయ్య గుర్రం 
తాతయ్య ఇచ్చాడు 
భలే గుర్రం 

కుదురుగా కూర్చుని 
ఊగుతాము 
చెవులు పట్టుకొని 
చెల్ చె ల్ అంటాం 

చెల్లినీ ఎక్కించి 
ఊపుతాను 
దోస్తులను తీసుకొచ్చి 
చూపుతాను 

గుగ్గిళ్లు అడగదులే 
మా గుర్రము 
బుద్ధిగా ఉంటుంది 
కొయ్య గుఱ్ఱము