మా అమ్మ(బాల గేయం)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

పిల్లలం మేము పిల్లలం
అమ్మ కంటి పాపలం
అమ్మ చేతిలో మేము
అందమైన పువ్వులం

అమ్మ ప్రేమలో మేము
తియ్యనయిన  తేనెలం
అమ్మ మాటలలో మేము
పసిడి పలుకుల పాపలం

అమ్మ గొప్పలో మేము
ఒప్పుల కుప్పలము
అమ్మ నవ్వులో మేము
విరబూసిన మల్లెలం

అమ్మ నడకలో మేము
మోగే కాలి మువ్వలము
అమ్మ పెంపకములో మేము
ఎదిగే బంగారు పాపలం