చిందుల చిన్నారి:--వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్, సిద్ధిపేట.
చిలుక పలుకుల చిన్నారి 
చిందులు వేయును చిన్నారి 
చిట్టిపొట్టి మాటలతో 
చిరునవ్వు వెదజల్లు చిన్నారి 

లేడిపిల్ల వలె గెంతుచున్నది 
మేక పిల్లవలె మెరియు చున్నది 
లేగదూడ వలె ముద్దులొలుకుచు 
చెంగుచెంగున ఎగురుతున్నది 

బాతు పిల్ల వలె బలేగున్నది 
ముద్దు పలుకులు చిమ్ముచునది 
కోయిల పాటలు పాడుతున్నది 
కమ్మనైన కథ చెప్పుచున్నది 

నెమలి నాట్యము నేర్చుకున్నది 
హంస నడకల హొయలుఉన్నది
ఉడుత పిల్లవలె ఉరుకులు పరుగులు 
చిన్నారి పాప చిందులేస్తది