బహుమతి మొత్తం చిన్నదే. అయినా, మా ప్రయత్నం ఘనమైనదని గ్రహించండి. మీరు మీ జిల్లాకు ప్రాతినిధ్యం వహించి బహుమతికి అర్హమైన గొప్ప కవితలు రాయండి! ఇది ప్రారంభం మాత్రమే! ఏ పోటీ పెట్టినా ప్రతీ జిల్లాకొక బహుమతిని ఇవ్వాలన్నదే మా అభిమతం. ఆ విధంగా నగరాల్లో
పెత్తనం చలాయిస్తున్న కవులకు, పల్లెల్లోని కవులు రచయితలు ఏ మాత్రం తీసిపోరనే నా ఉద్దేశ్యాన్ని మీరూ గ్రహిస్తారని నా నమ్మకం. మీదే ఊరు, ఏ జిల్లా అన్న విషయం స్పష్టంగా రాయండి. నగరాల్లో ఉండి జిల్లాల తరఫున దయచేసి రాయవద్దు. ఏ ఒక్కరి ప్రమేయమూ, ప్రభావమూ, పైరవీలకూ తావులేదు కాబట్టి ప్రతిభకే కట్టబడుతుంది. మిగిలిన సూచనలు పాటించండి.
ఈ వినూత్న ప్రయోగాన్ని ఆశీర్వదించండి!
"#సినీవాలి" స్థాయిని పెంచే ప్రయత్నం చేయండి.
శుభాకాంక్షలు:
డాక్టర్ ప్రభాకర్ జైనీ,
చీఫ్ ఎడిటర్,
"#సినీవాలి" వారపత్రిక
తెలుగు కవులారా! కలాలు ఝుళిపించండి! :-డాక్టర్ ప్రభాకర్ జైనీ,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి