ఆధునిక మహిళగా ఆదర్శమూర్తిగాకస్తూరిబా వెలిగె కడవరకు దివ్వెగాబాలికా వధువుగా బాధ్యతలు మోసినదిగాంధీజి ఛాయలో కాంతిగా మిగిలినదిపదమూడు యేండ్లకి పదిమంది గలనింటతలలోని నాలుకగ తనయోర్పు చూపినదిసంపదల పుట్టిల్లు సమస్యల నత్తిల్లుఆటుపోట్ల నడుమను ఆమె జీవితనౌకపేదరికమూ మరియు పెనుఉప్పెనల చోటుపచ్చి బాలింతయిన పతి వెడలె లండన్ కుకుల బహిష్కరణమును కుల పెద్దలే జేయపుట్టింటి యాదరణ పూర్తిగా లేకుండఅత్తయ్య మరణముకు అత్యంత విచారముకుటుంబమును నడిపే కూరిమిన త్యాగమయిబంగారమును యమ్మి బాగుగా చదివించెభర్త మాటయె తనకు భావిగా నూహించెదక్షిణాఫ్రికాలో తన సుఖము కొన్నాళ్ళుచేరినారు మరలను చెరుకుతోటల యందునిరాడంబర చరిత నిర్భయము సహనాన్నిమూడు దశాబ్దాలను మునిగె పోరాటాలమహా పురుషుల వెనుక మహిళలే యొకదన్నునిర్ణయములకు వెనుక నిలుచు వేదన లెన్నొజాతి స్వతంత్రము జన్మహక్కు యటంచునిలిచేను కస్తూరి నిర్మలపు సౌరభము!
కస్తూరిబా గాంధీ :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి