విద్యార్థి దశలో తేజము
విలక్షణ సేవ స్కౌట్
పలు రంగాలలో విధిగ
ప్రశంసలు పొందు స్కౌట్
వారెవ్వా స్కౌట్ దళం
నవ చేతన పద్మ దళం !
ఉపాధ్యాయుడే నడుపును
సేవా దళమును కూడా
క్రమశిక్షణ నేర్పుతాడు
ప్రతి దిన కవాతు కూడా
వారెవ్వా స్కౌట్స్
సేవలలో గ్రేట్స్ !
దేవాలయాలు,జాతర
జనం కూడు స్థలములో
క్రమపద్ధతి నడుపుతారు
గురువు తర్ఫీదు విధిలో
వారెవ్వా స్కౌట్స్
సేవలకి లేవు లిమిట్స్ !
భావి జీవిత దశలలో
ఎంతో ఉపయోగకరము
క్రమబద్ధపు జీవితాలు
గడుపుటయే సులభతరము
వారెవ్వా బాల భటులు
ఆట,పాటలలో చతురులు !
దేశభక్తి కలుగుతుంది
అవగాహన పెరుగుతుంది
క్లిష్ట పరిస్థితులలో
నిబ్బరమే నిలుస్తుంది
వారెవ్వా నా బాల్యస్మృతి
స్కోట్ దళములో ప్రగతి !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి