సత్యమునకు దారులు
జ్ఞానమే శిఖరములు
కపటము మర్చిపోయి
విచక్షణను పెంచుకొనుము
త్రికరణశుద్ధిని కలిగి
అంతర్వాణిని పొంది
నమ్మకము గలిగియున్న
ఆశావాదం గెలుపు
విచారణాత్మక దృష్టి
వివేకపు ఆలోచన
స్వయం ప్రజ్ఞానము పెంచుకొని
సత్య శిఖరమధిరోహించు
సత్యమెంతో కష్టము
నదియునెంతో శ్రేష్ఠము
పాటించిన నీ బ్రతుకంతా
చిరకాలము ఉన్నతము
సత్యమునే మాట్లాడుము
సత్యమునే కోరుకొనుము
అసత్యమును వదులుకొనుము
ఆనందముగ జీవించుము