*పిల్లి - కోతి*(గేయకథ):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
(మొదటి భాగము)

1)
అనగనగా పిల్లి ఉండె
దానికొక్క తల్లి ఉండె
చెట్టుమీద కోతితోడ
వాటికేమొ స్నేహముండె !
2)
ఒక్కనాడు పిల్లితల్లి
మేతకొరకు పోయినపుడు
కుక్క ఒకటి పొంచిఉండి
పిల్లిపిల్ల  నోటకరిచె !
3)
నక్కినక్కి పోయెనపుడు
ఆరగింప జూచెనపుడు
అదిజూసిన కోతి గెంతి
కుక్కనపుడు రక్కిపెట్టె !
4)
రక్కిన ఆ కోతి నుండి
తప్పించుకు పోవుటకై
ఆలోచన చేసి కుక్క
అటునిటుగా ఉరికిందీ !
(ఇంకావుంది)