*కుక్క - నక్క*(గేయకథ):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 (రెండవ భాగము)
6)
"చూడు చూడు ఈ ఎలుక
కొరుకలేదు ఒక్క కాయ
రుచి వుండిన పచ్చికాయ
కొరుక కుండునా ఎలుక?
7)
చూడుమింక చేనువంక
సొరకాయల తీరునింక "
చేనునంత కలయజూసె
కుక్క మాట విన్న నక్క!
8)
ఔనని మనసున తలచీ
కుక్క మాట నమ్మి నిలిచి
"నేస్తం! నీవన్నమాట
నిక్కము నే నమ్ముచుంటి!
9)
తప్పక మరు దినము మనము
పోవుద మింకొక చేనుకు
కాయలన్ని తినదగినవి
బహుబాగుగ రుచి గలవీ!
10)
చేను దారి జూప వలయు
నా కడుపును నింపవలయు "
అని చెప్పీ చక్క బోయె
కుక్క నిడిచి వెళ్ళి పోయె!!
(సమాప్తము)

కామెంట్‌లు