సిత్ర కైతికాలు :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
రామకథలోన శబరీ 
నిరీక్షణలో నున్నదీ 
రాముని రాకకు మురిసీ 
ఎంగిలి  పళ్ళిచ్చిందీ 
అరె తీపిభక్తి ఇదేరామా 
ఆమెయుక్తికి మొక్కుదామా 

ఎన్నినాళ్ళకు దర్శనం 
ఎదలోన పరవశత్వము 
రామయ్య తండ్రిని గని 
శబరి కనులలో భాష్పము 
ఆహా నమ్మకమైన భక్తి 
మమకారం చివరికి ముక్తి!

నిషాద  మహిళయే ఈమె 
నాగరికత తెలియరాదు 
ఆనోట ఈ నోట విని 
ముగ్దభక్తి మరచి పోదు 
అమ్మా శబరీ వందనాలు 
నీ రాముని కనుగొంటివి!

జన్మతో సంస్కారము 
పరిమళించి అలుముకొను 
కన్నులలో మమకారం 
చివరి వరకు నిలుపుకొను 
రామాయణ కావ్యమిదే 
మానవత్వ మహిమలివే!



కామెంట్‌లు