విశ్వదిక్సూచి(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 సనాతన ఆచారాలు,ధర్మనిష్ఠ
నిగూఢ విజ్ఞానశాస్త్ర రహస్యాలు,సత్యాలు
భారతీయ జీవనవిధానంలో భాగాలు
అనాదిగా అనేక రూపాల్లో
నడుస్తున్న ఈ సంస్కృతీ విధానాలు
ఆచరణీయాలు,ఆరోగ్యకారకాలు
పాశ్చాత్య సంస్కృతి విపరీతపోకడలు
విశృంఖల కరాళనృత్యం చేసి చెరిపివేస్తే
వాటి ధాటికి తట్టుకొని‌ నిలబడ్డ
అమేయాలు,అమృతవిధానాలవి
మహమ్మారి జననం,వ్యాప్తి కాగానే
ప్రపంచం మేల్కొన్నది
భారతదేశం వైపు,భారతీయత వైపు ఆశగా ఎదురుచూసింది
కరచాలనాలతో ముప్పుందని,
నమస్కారాలే మేలని
కాళ్ళు,చేతులు కడుక్కొని
గృహప్రవేశం చేయాలని
పసుపు,బియ్యంపిండులతో వేసే ముగ్గులు వైరస్లను
గుమ్మం దాటనీయవని
పేడతో కలిపి చల్లే కళ్ళాపితో
ముంగిలి వైరస్ రహితమవుతుందని
వంటగదిలోని సంప్రదాయ దినుసులే రోగనిరోధకశక్తిని
పెంచుతాయని
గోరువెచ్చని నీరు హృదయాన్ని భద్రం చేస్తుందని
అభ్యంగనస్నానమే అత్యంత మేలైనదని
విచ్చలవిడిగా తిరగడం హానికరమని
తెలుసుకొని,ఆచరిస్తున్నది
భారతీయ జీవనవిధానం,సంస్కృతికి మోకరిల్లుతున్నది.
కామెంట్‌లు