(విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ గారి ఆంగ్ల రచనకు అనువాదం )
గుడికి వెళ్ళకు దైవపదముల
పూల నుంచుటకూ
మొదట నింపుము సొంతగృహమున ప్రేమపరిమళమూ!
దీపముంచుట కొరకు వెళ్లకు
స్వామి ఎదురుగనూ !
మనసునందలి పాపతిమిరo
తొలగించుకొను ముందూ!
తలనువంచగ వెళ్లకండి
ప్రార్ధనల కొరకూ!
సాటిమనుషుల ముందుతలను
వంచుకో మొదటా!
ఆలయమందున మోకరిల్లుట
కోసమే వెళ్లకూ !
బడుగు మనిషిని నిలిపిచూడగ
నీవె నడుమొంచూ !
పాపప్రక్షాళనము క్షమను
అడుగుతూ గుడికెళ్ళకూ!
హృదమున మన్నించు ముందు
హానిచేసిన వారినిపుడూ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి