మళ్లీ కరోనా-మణి పూసలు:-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
కరోనా రెండోసారి
రూపులేన్నెన్నో  మారి
పరుగు పరుగునొస్తుంది
సమూహములో నది దూరి

వింత వింతగా ఉంటుంది
వింతి రోగం తెస్తుంది
ఒంటి లోకి చేరి పోయి
మనిషి ప్రాణం తీస్తుంది

మూతికి మాస్కు పెట్టండి
దూరాన్ని పాటించండి
గుంపులుగా చేరొద్దు
జాగ్రత్తగా ఉండండి

సూది మందు తీసుకోండి
ఆరోగ్యం చూసుకోండి
అందరి బాధ్యత ఇది
తప్ప కుండ తీసుకోండి

పాడు పురుగును తరుమండి
దరికి చేరనియ్య కండి
మందుతో మేలు కలుగును
భయము అసలే వద్దండి