.ఉగాది పండుగ ఆ.వె.: వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్, సిద్దిపేట.
కొత్తవత్సరమని కొండంత ఆశతో 
యెదిరిచూచు చుంటి యెతలతోడ 
యేమి చేస్తవమ్మ యెదురేగి వచ్చావు 
కష్టములను బాపు కరుణతోను  

పాత వత్సరంబు పాడును జేసింది 
పాపియగుచు తాను 
పగయుబట్టి 
లేని రోగమొచ్చి లేపుక పోయింది 
కష్టపెట్టి ప్రజల కరుణ లేక 

పోతుపోతు తాను పొందుగా యిచ్చింది 
కొత్త రోగమొకటి గోరివచ్చె 
ప్రజల పెట్టు బాధ 
పలురకములనెన్నొ 
శ్రద్ధ లేకయున్న చావ గొట్టు 

కొరివి దయ్యమోలె నురుముతూ వచ్చింది
 కొంపలెన్నొ కూల్చు కుటిలముగను 
కక్ష యేలనమ్మ కయ్యమెందుకు మమ్మ 
పారిపొమ్ము త్వరగ పతన జేతు 

ప్లవము వచ్చినాది పదిలంగ జేయను 
బాధలెన్నొ దీర్చు బాధ్యతగను 
వేచి చూడనదియు వివరంగ తెలియను 
కలత చెంద వలదు కామితార్థ