సమైక్యతా గీతం:-అమృతవల్లి. ఎ
భారతీయ విద్యార్థినులం
భారత భావి పౌరులం
ప్రపంచ భారతోద్యానవనంలో
వికసించిన సుమ కన్యకలం...భార

కులమేదైనా మతమేదైన
కలసికట్టుగా ఒకటే జాతని చాటుతాం
కల్లాకపటం ఈర్ష్యా ద్వేషం
మనదరి చేరరాదని మంచిని చాటుతాం..భార

ఉన్నవారికీ, లేనివారికి
హద్దులు మేము చేరిపేస్తాం
అందరి ఆకలి ఒక్కటే అని
అందరి లక్ష్యం ఐకమత్యమని
అదే మానవత కు ప్రతి రూపమని నినదిద్దాం..
భార..

నీ కర్తవ్యాన్ని శ్రద్ధతో చేయుమన్నదే గీతాసారం
నీ శత్రువునైనా ప్రేమించమన్నదే బైబిల్ సిద్ధాంతం..
మనిషిగ మెలిగి మమతను పంచి
పరోపకారమే పరమధర్మమన్నదే అన్ని మతాల సారాంశం....అదే అసలైన జీవన వేదమంటూ సాగుదాం....భార