ఉడుత-- ఊయల:-సత్యవాణి--కాకినాడ

 ఉయ్యాలలో పాప ఊగుచున్నాదీ
ఉడుతమ్మ పాపొడిలోన ఒదిగి కూర్చుందీ
పాప ఊయల పాట పాడుచున్నాదీ
పాప పాటకు ఉడుత తోక ఊపిందీ
తోక ఊపులు చూసి పాప నవ్విందీ
పాప నవ్వులకుడత పరవశించిందీ
పాప ఉడుతకుమంచి పండు ఇచ్చిందీ
కళ్ళు మూసుకు ఉడుతారగించిందీ
ఉయ్యాల ఊపాగె ఉడుతమ్మ దూకె
చెట్టు కొమ్మ పైకి చరచరా చేరే
పాప చేతులు ఊపి వీడ్కోలు పలికెే
చెట్టు గుబురుల్లోకి చేరె ఉడుతమ్మా
చకచకా ఇలు చేరె చిన్న పాపాయి