క్లాసు బయటే నిలబెట్టారు.:--డా.. కందేపి రాణీప్రసాద్.

 ఎడవ తరగతి చదివేటప్పుడు ఒకసారి నాకు బాగా జ్వరం వచ్చింది. ఆ జ్వరం దెబ్బకు నెలరోజులు స్కూలుకు వెళ్ళలేదు. మా ఇంకొల్లులో పిల్లల డాక్టర్ ధర్మనంద రావు గారని ఉండేవారు. మా ఇంట్లో ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆయనే చూసేవారు. అప్పుడు ఏం జ్వరమో గుర్తులేదు కాని నెలరోజులు ఇంట్లోనే ఉండిపోయాను. జ్వరం తగ్గక ఒకరోజు స్కూలుకు పంపిస్తా అన్నారు మా అమ్మానాన్న.
అప్పట్లో మా స్కూలులో ఎవరు ఒక్కరోజు అబ్సెంట్ అయిన లీవ్ లెటర్, డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మనే వాళ్ళు అవి లేకపోతే క్లాసురూం బయటే నిలబెట్టేవాళ్ళు. నేను ఇవన్ని చెపితే ఇంట్లో నాన్న లీవ్ లెటర్ రాసి పెట్టదు. డాక్టరు సర్టిఫికెట్ కోసం మా అన్నయ్యను పంపితే డాక్టరు ఊర్లో లేదని తిరిగి వచ్చాడు. ‘సరే లీవ్ లెటర్ తీసుకొని వెళ్ళు రేపు డాక్టర్ సర్టిఫికెట్ ఇద్దాం’ అన్నాడు నాన్న. “డాక్టర్ సర్టిఫికెట్ లేకపోతే మా మాస్టారు లోపలి రానివ్వడు. నేను వెళ్ళాను” అని మొండి కేశాను. అప్పుడు అమ్మ “అన్నయ్య నీకు తోడుగా వస్తాడు మాస్టరుకు విషయం చెబుతాడు నిన్ను క్లాసు బయటే ఉంచరు నీకేమి భయం లేదు” అన్నది.
‘సరే అయితే’ అని స్కూలుకు బయల్దేరాను. జ్వరం తగ్గిందన్న పేరే గాని నీరసం వదల్లేదు ఇప్పటికే చాలా రోజులు స్కూలు పోయింది అని ఇంట్లో వాళ్ళు పంపిస్తున్నారు. మా అన్నయ్య నాతో పాటు స్కూలుకు వచ్చాడు. క్లాస్ రూం లోకి వెళ్లి నన్ను కూర్చోబెట్టారు. అప్పటికింకా మాస్టర్ రాలేదు. ఫస్ట్ పిరియడే క్లాస్స్ టిచరిది. మా అన్నయ్య ఒక అరగంట ఉన్నాడు ఇంకా మాస్టర్ రాలేదు. అప్పుడు మా అన్నయ్య “నేను ఇప్పుడే అల బజార్ దాకా వెళ్ళొస్తా. మాస్టర్ వచ్చేసరికి వచ్చేస్తా నువ్వేం భయపడకు” అని బయటకు బయల్దేరాడు.
నా పైప్రాణం పైనే పోయింది. ఇప్పుడు బజారుకు వెళ్తానంటాడేమిటి అన్నయ్య. తను వచ్చేలోపు మాస్టారు వచ్చేస్తా నా సంగతేమిటి” అని భయపడి వద్దు అన్నయ్య! ఇప్పుడు వచ్చేస్తాడు మాస్టారు” అన్నాను కంగారుగా. “నేను కూడా వచ్చేస్తాలే. ఎందుకు భయపడతావు” అంటూ మా అన్నయ్య వినకుండా వెళ్ళిపోయాడు. మా క్లాస్ రూం కిటికిలో నుంచి మా అన్నయ్య వెళ్ళిన వైపే చూస్తూ కూర్చున్నాను. మాస్టారు ఎదురు వస్తాడేమో, ఆయనను చూసి మా అన్నయ్య తిరిగి వచ్చేస్తాడని నా ఆశ. కాకపోతే నా ఆశ అడియాశే అయింది.
‘సరే ఇంకేం చేస్తాం’ అని కళ్ళు ఇటువైపు తిప్పెసరికేల్ల మాస్టారు రూములో కొచ్చేశాడు. రాగానే అటెండెన్స్ రిజిస్టర్ తిసి పేర్లు చదవసాగాడు. నా పేరు వచ్చినపుడు ‘ ప్రెజెంట్ సార్’ అనగానే ఏంటి నువ్వు నెల రోజుల నుంచి రావట్లేదు అన్నాడు.
అయన అడగడము నేను లీవ్ లెటర్ మాత్రమే ఇచ్చి డాక్టరు సర్టిఫికెట్ రేపు తెస్తానని చెప్పడము, నన్ను క్లాసులో నుంచి బయటకు గేన్టడము ఐదు నిముషాలు పట్టలేదు ఆ సమయంలో మా అన్నయ్య మీద నాకు విపరీతమైన కోపం వచ్చింది. “కొద్దిసేపు ఉండుంటే మాస్టర్ వచ్చేవాడు కదా! ఎదో పని అంటూ బయటి కెళ్ళాడు ఇంకా రాలేదు” అనుకుంటూ క్లాస్ రూం బయట నిల్చున్నాను. అక్కడ నిలబడితే అన్ని తరగతుల వాళ్ళకి కనిపిస్తాం. ఎదో తప్పు చేసిన వాళ్ళలాగా శిక్ష అనుభవించటం చాల అవమానంగా అనిపించింది. మా అన్నయ్యను పంపకుండా మా నాన్నే వచ్చుంటే బాగుండునని అనిపించింది.
నేనిలా ఆలోచిస్తూ నిలబదినపుడు అటెండర్ వచ్చి హెడ్ మాస్టారు గారు పిలుస్తున్నారంటు వచ్చాడు. అమ్మో ఆయనెందుకు పిలుస్తున్నాడో అనుకుంటూ భయం భయంగా అయన రూంలో అడుగు పెట్టాను. “నువ్వు నెలరోజులు స్కూలుకు రాలేదు కాబట్టి నీ పేరు తీసేశారు మరల అందులో ఎక్కించటానికి 30రూ. ఫీజు కట్టాలి. ఇప్పుడు ఇంటికి వెళ్లి డబ్బులు తిసుకునిరా. రిజిస్టర్లో పేరు రాస్తాను”. అన్నాడు హెడ్మాస్టర్.
‘అంతేనా’ అని ఉపిరి పిల్చుకున్నాను. సరే అని ఇంటికి బయల్దేరాను అసలే జ్వరం నీరసంతో పొద్దున్న రావటమే కష్టమైంది ఇప్పుడు మళ్ళి ఇంటిదాకా వెళ్లి రవళి అనుకుంటూ నిరసనగా కాల్లిడ్చుకుంటూ నడుస్తున్నాను.
దారిలో ‘ ఏంటి ఇంటికెళ్తున్నావు ‘ అనే మాట వినపడడంతో పక్కకు తిరిగి చూశాను. రోడ్డు పక్కనున్న బ్యాంకు దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ తో బాతాఖాని కొడుతూ కనిపించదు మా అన్నయ్య. నాకు పీకలదాకా కోపం వచ్చింది. అయిన అదేమీ లేకుండా జరిగిన విషయం చెప్పను. “ సరే ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని కట్టు” అంటూ మళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో మాటల్లో మునిగిపోయాడు.
ఇప్పటికి ఈ విషయం ఇంత బాగా గుర్తున్నదంటే అప్పుడు మా అన్నయ్య మీద వచ్చిన కోపం బలంగా ఉండటమే నేనెన్ని సార్లు చెప్పిన అమ్మానాన్నకు వినలేదు చివరకు నేను ఉహించిన విధంగానే క్లాసు క్లాసు బయట నిలబెట్టనే నిలబెట్టాడు నన్ను మాస్టారు. పిల్లల మాటల్ని పెద్దవాళ్ళు కొట్టి పారేస్తారు గాని కొద్దిగా వినాలి ఆలోచించాలి. మనం పిల్లల్ని అర్ధం చేసుకోవాలి. ఇది నా చిన్ననాటి సంగతి.