మంచి నీరు -బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

ఎండకు విరుగుడు నీరు 
ఎన్నితాగిన అంత మేలు 
శుభ్రమైన నీరు ఆరోగ్యం 
జలమే దేశపు సౌభాగ్యం!

వేసవిలోన వెంటఉంచుకో 
వడదెబ్బకు నిను కాపాడుకో 
ప్రాణం నిలిపే గుక్కెడు నీరు 
ప్రాణులజీవం పోసే నీరు !

నీటినిఉంచే పాత్రల శుభ్రత 
పాత్రలపైన మూతలభద్రత 
ప్రయాణంలో నీరు ముఖ్యం 
కలుషితనీరు హానికరం !