మద్యం సేవించడం
హానికరం !
ఒప్పుకున్నాం .
మద్యం సేవించి ,
భార్యను
బాధించడం
వేధించడం తప్పు !
ఒప్పుకున్నాం .
తప్పతాగి ,
నడిబజార్లో
చిందులు తొక్కడం
నేరం !
ఒప్పుకున్నాం .
పీకలదాకా తాగి
డ్రైవింగ్ చెయడం
పరమ నేరం !
ఒప్పుకున్నాం .
మరి ...
నాదొక డౌటు !
ఓటేయడానికి
మద్యం తాగి రావచ్చా ?
బాబ్బాబు ....
మీకు పుణ్యం ఉంటుంది ,
కారు నడిపేవాడిని
పరీక్షించినట్టే ,
ఓటేసేవాడికి కూడా
పరీక్షలు చేయండి !
మద్యం సేవించటం
నేరంకదా !
మా బతుకులు
నిలబెట్టేటోళ్లు
మీరే కదా !!
అందుకే ..
పోలింగ్ బూత్ లలో కూడా
మద్యం పరీక్షలు చేసి ,
మమ్మాదుకోండి బాబులు !
మా వాళ్ళ
సంసారాలను
ఆదుకోండి ప్రభువులు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి