అపార్ధం(నీతికథ) డా.బెల్లంకొండనాగేశ్వరరావు.


 అమరావతినగరంలో విశ్రాంత అటవిశాఖాధికారి రాఘవయ్యగారి ఇంటి అరుగుపై కథవినడానికి చేరిన ఆవీధిలోని పిల్లలు అందరికి మిఠాయిలు పంచినరాఘవయ్య తాతయ్య"పిల్లలు మీకు ఈరోజు అపార్ధమే అనర్ధాలకు

మూలం అనితెలిసేలా ఓ కథచెపుతాను.మనరాజ్యాన్ని పూర్వం చంద్రసేనుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు.

ఒకసారి తనమంత్రి సుబుధ్ధి తోకలసి మారువేషాలలో నగర పర్యటనకు బయలుదేరి చాలాప్రాంతం తిరిగి కోటకు వచ్చేదారిలో బాగా కాపుమీద ఉన్న మామిడితోట కనిపించింది దోరమగ్గిన మామిడి పండ్లను చూసిన రాజు గారికి నోరుఊరింది.తోటసమీపంలోని యువకుని చూసినరాజుగారు

"నాయనా ఈతోటలోని మామిడిపండు చూస్తుంటే తినాలి అనిపిస్తుంది రెండుపండ్లు ఇవ్వగలవా"అన్నాడు."అయ్యతమరు బాటసారుల్లాఉన్నారు

గుర్రాలుదిగి ఆచెట్టునీడన సేదతీరండి"అని తోటలోనికివెళ్లి రెండుమామిడి పండ్లు దిగుడుబావివద్ద నీటిలో కడిగి తెచ్చి రాజు,మంత్రికి చెరొకపండు అందించాడు.

మామిడిపండు ఆరగించిన రాజు సంతృప్తిచెంది"నాయనా పండురుచి చాలాబాగుంది.నాకు రెండు గంపలనిండుగా పండ్లుకావాలి  వెల ఎంతొ తెలియజేయి,నేచెప్పిన చిరునామాలో పండ్లు అందజేసి వాటికిరావలసిన ధనంతీసుకువెళ్ళు"అన్నాడు."అయ్య ఇది నామిత్రునితోట పక్కనే ఉన్నది నాతోట మీరుకోరినవిధంగా రెండుగంపల పండ్లు ఎవరికి అందజేయాలో తెలుపండి అందజేసి వాటిధర ధనంతీసుకుంటాను.అన్నాడు ఆయువకుడు.క్షణకాలం ఆలోచించిన రాజు"నాయనా ఉచితంగా ఇవ్వడానికి నీమిత్రునితోటలో పండ్లు,అమ్మకానికి అయితే నీతోటలోని పండ్లు అంటున్నావు.ఇదిమిత్రద్రోహంకదా"అన్నాడు రాజుగారు. "మన్నించడి బాటసారి, మీరు అపార్ధం చేసుకున్నారు.స్నేహధర్మంలో అతని అనుమతిలేకుండా రెండుపళ్లు దానంచేయవచ్చు కాని పండ్లధరతెలియకుండా అతని వస్తువుకు నేను వెలనిర్ణయించడం న్యాయంకాదు.నా తోటలోని పండ్లకు నేను వెల నిర్ణయించడం న్యాయం,అందుకే నాతోటలోని పండ్లు తమకు అమ్మచూపాను"అన్నాడు ఆయువకుడు వినయంగా.అతనిమాటల్లోని నిజాయితి గ్రహించిన రాజు చిరునామా తెలిపి వెళ్లిపోయాడు.

"బాలలువిన్నారుగా అపార్ధంకథ. అపార్ధమే అనర్ధలకుమూలం అనితెలుసుకున్నారుగా మీజీవితంలో ఏనాడు అపార్ధనికి అవకాశంయివ్వకండి"అన్నాడు రాఘవయ్య తాతయ్య.బుద్ధిగా తలఊపారు పిల్లలంతా.