'జన్మ ధన్యం'...:-- ఎన్నవెళ్లి రాజమౌళి - కథల తాతయ్య

 బడిబాట అంగరంగ వైభవంగా ప్రాథమిక పాఠశాల గణపురంలో జరుపుకుంటున్నాం. మా బడి లో మామిడి ఆకుల తోరణాలు కట్టాము. పిల్లలు ఒకటే హడావిడి. పిల్లలందరూ యూనిఫామ్ లో వచ్చారు. పిల్లలు యూనిఫాంలో ఉండడంతో స్కూల్ కి అందంగా కనిపిస్తున్నారు. ఆనాడు అక్షరాభ్యాస కార్యక్రమం. పిల్లల తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు వచ్చారు. రంగురంగుల పలకలు ఒకటో తరగతి పిల్లలకు ఇచ్చాము. బలపాలు కూడా రంగురంగుల వి ఇవ్వడం విశేషం. పిల్లల ముఖాలు కోటి సూర్య ప్రభలతో ఉన్నాయి. తల్లిదండ్రులు వారి వారి పిల్లల దగ్గర కూర్చుండి ఓం నమశ్శివాయ రాయించు తూ ఉన్నారు. మా సార్లు కూడా పిల్లల వద్ద కూర్చుండి రాయించు తూ ఉన్నారు. నేను ఒక పాప దగ్గర కూర్చుండి ఓం నమశ్శివాయ రాయించాను. ఆ పాప రాస్తూ రాస్తూ నే నా తొడ పైకి ఎక్కి కూర్చుంది. నా ఒళ్ళంతా పులకరించింది. పిల్లలు సామాన్యంగా సారు లకు దూరం ఉంటారు. అటువంటిది నా నా తొడ పైన ననే కూర్చోవడం నా వృత్తికి న్యాయం చేసి, నా జన్మ ధన్యం చేసుకున్నాను.