జంతువులు పక్షులు (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
పిల్లిని పెంచే మల్లయ్య
పుంజును పెంచే అంజయ్య
కుక్కను పెంచే కనకయ్య
బాతును సాదె బాలయ్య

పొద్దున లేసి పిల్లి పిల్ల
కమ్మిన పుంజునొదిలింది
పుంజు పిల్లి వచ్చాయి
పెరటి లోన చేరాయి

కుక్క చూసి వచ్చింది
బాతు జల్ల లేపింది
కుక్క బాతు కలిసాయి
ఇంటి పక్కకు వెళ్ళాయి

పిల్లి తబల కొట్టింది
పుంజు పాట పాడింది
కుక్క డక్కి కొట్టింది
బాతు నాట్యం చేసింది

చిన్నారి పిల్లలు రారండి
జంతు పక్షులను చూడండి
విరోధము వద్దని చాటండి
ఐక్యతతో మీరు ఉండండి