జాగ్రత్తలు:- కవిత వేంకటేశ్వర్లు
ఎండలు మండు తున్నాయి
గొంతులు ఎండుతున్నాయి
తీసుకోవాలి జాగ్రత్తలు 
నీడలో ఉండాలి పిల్లలు!!

తగలకూడదు వడదెబ్బ
పడకూడదు ఎదురుదెబ్బ
పిల్లలను చూసుకోవాలి పెద్దలు
ఏర్పరచాలి వారికి హద్దులు!!

తక్రమును తాపించాలి
అరగంట గ0టకు తాపుతుండాలి 
విపరీతమైన తాపాలు
కాకూడదు పిల్లల పాలిట శాపాలు!!

తాపకండి కూల్డ్రింక్స్
రోగాలు అవుతాయి ఫిక్స్
జిహ్వ చాపల్యానికి లొంగి
తీసుకోకండి త్రాగుబోతు భంగి!!

గ్రీష్మములోనే కాదు 
ఎప్పటికి వద్దు పిజ్జా బర్గరులు
వాటితో పెరుగుతాయి ఉబకాయాలు
పిల్లలకు చేయకండి ఆ అలవాట్లు
అలవాట్లే అవుతాయి వ్యసనాలు!!