అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు బాలలూ : మొహమ్మద్ . అఫ్సర వలీషా:-ద్వారపూడి (తూ గో జి )

 పుస్తకాలు చదవండి
మహా మహుల అంతరంగ
మేధస్సును ఆవిష్కరించండి
మీ జ్ఞానానికి రహదారి వారధులవి
 మీ అలసటకు సాంత్వన పూల జల్లులవి 
మీ ఊహలకు ఊపిరి అలలవి 
మీ ప్రయాణానికి తోడు ఊతలవి
మీ భయానికి అభయ రెక్కలవి 
మీ చెదరిన మనసుకు ఆనందపూతోటలవి
మీ సంతోషానికి సరిగమ పదనిసలవి
మీ మౌనానికి అలరించే చిలుక పలుకులవి
మీ ఉత్తేజానికి చైతన్య గీతికలవి
మీ సమస్త ఆభరణాలు
పుస్తకాలని తలవండి 
మీ హస్త భూషణాలని మరువకండి....!!