'అసెంబ్లీ కి వెళ్ళాం'.... : - ఎన్నవెళ్లి రాజమౌళి - కథల తాతయ్య


 నేను యూత్ క్లబ్ నేతగా ఉన్న రోజులు. ఊరిలో ఏ సమస్య ఉన్నా ఎదురు తిరిగే వాళ్ళం. హై స్కూల్ బిల్డింగ్ నిర్మాణం జరిగి సంవత్సరం కాలేదు. అంతా క్రాక్ వచ్చింది. ఈ విషయము అసెంబ్లీలో చర్చ జరిగేటట్లు  చూడు. అని, చెన్నయ్య అన్న అన్నాడు. సంబంధిత ఫోటోలు కూడా ఇచ్చి, బస్సు కిరాయి ఇచ్చాడు. నేను మా మిత్రుడు భూపతిరెడ్డి హైదరాబాద్ వెళ్దాం. ముందుగా అప్పటి ప్రతిపక్ష నేత వెంకయ్యనాయుడు గది కి వెళ్ళాము. ఆయన ఢిల్లీకి వెళ్లాడట. ఎలా అని ఆలోచించి-ఇంకొక ప్రతిపక్ష నేత అప్పటి జనతా నాయకుడు జైపాల్ రెడ్డిని కలిశాము. ఆయన ఎక్కడి నుండి వచ్చారు. అని అడుగగా-సిద్దిపేట నుండి అని చెప్పాను. వెంకట రావు గారి లెటరు తెచ్చారా అన్నాడు. మేము కూడా సేవ చేస్తున్నాం సార్. వెంకట్రావు లెటర్ తేవాలని తెలియదు సార్. అన్నాను. ఆప్యాయంగా నా జబ్బపై కొట్టి-నేను ఏమి అన్న -అన్నాడు. మరి నేను ఏమన్నా సార్ , అని నేను అనగానే-అక్కడ ఉన్నవారు బాగా అన్నవు అన్నట్లు కళ్ళు ఎగరవేశారు. మరునాడు మమ్ములను కారులో కూర్చుండబెట్టుకొని అసెంబ్లీ కి తీసుకెళ్లాడు. అక్కడ రెండు ప్రశ్నలు తయారు చేసుకున్నాడు. ఇక మీరు వెళ్ళండి అనగానే-ఆకలి రాజ్యం సినిమా చూసి బస్సు ఎక్కాం. వారం రోజులకు రేడియోలో జైపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినట్టు, అధికారులు ఆగమేఘాల తో వచ్చి, బిల్డింగ్ అంతా ప్లాస్టరింగ్ చేశారు.