(రెండవ భాగము)
5.
ఎన్ని దినము లైనగాని
సంతానము లేకపోయె
ఎదురుచూసి ఎదురుచూసి
విసిగిపోయెనంతలోన !
6.
ఒక్క రోజున గురవయ్య
పక్కనున్న ఊరిలోన
సంత జరుగుతున్న వేళ
ఆ వూరికి పోయి చేరె !
7.
సంతలోన అమ్మకముకు
పెట్టినారు వ్యాపారులు
అందమైన గొర్రె ఒకటి
బహు చక్కని కుక్క ఒకటి !
8.
వానినంత జూచి అతడు
కొనినాడు తగిన వెలకు
కొనితెచ్చిన వాటినతడు
బహుచక్కగ చూచుకొనియె !
(ఇంకావుంది)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి