యలమర్తి అనూరాధకు ఆహ్వానం

 డాక్టర్ సి.నారాయణరెడ్డి-వంశీ విజ్ఞాన పీఠం,ఇండియా,శ్రీ సాంస్కృతిక కళా సారధి, సింగపూర్,సాహితీ కిరణం మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా "ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవం" ఈనెల 23,24,25 తేదీల్లో అంతర్జాలం వేదికగా నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు వంశీ రామరాజు గారు తెలిపారు. ఇందులో భారత దేశం, అమెరికా,కెనడా,నార్వే, ఫిన్
లాండ్,సింగపూర్,దక్షిణ ఆఫ్రికా,ఆస్ట్రేలియా,దోహా-ఖతర్,అబుథాజీ,న్యూజిలాండ్,హాంగ్ కాంగ్,మలేషియా, మారిషస్,ఒమన్,బహ్రెయిన్ వంటి 17 దేశాల వారు 200 మందికి పైగా పాల్గొటున్నారు.    
     ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ ఈ "ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవం"లో జరిగే కవి సమ్మేళనం లో పాల్గొనవలసిందిగా వారి నుంచీ ఆహ్వానం అందుకున్నారు. 25 వ తారీఖున సాయంత్రం  ఐదు ఆరు గంటల మధ్య వీరు తమ కవిత వినిపిస్తారు. స్థానికులు పరిపాలకులు ఈ సందర్భంగా గా అనూరాధ గారిని అభినందించారు.
కామెంట్‌లు