బాలాగేయం-పిల్లలం: ---దుగ్గి గాయత్రి,టి.జి.టి.తెలుగు,కల్వకుర్తి,నాగర్ కర్నూల్,తెలంగాణ.
పిల్లలం మేం చిలిపి నవ్వుల మువ్వలం
అల్లరి చేష్టల అన్నులమిన్నలం
అమ్మానాన్నల పసిడిమూటలం
అవ్వా తాతల మురిపాలం
గురువులు మెచ్చే శిష్యులం
                        " పిల్లలం"
చిలపలుకుల చిన్నారులం
ముచ్చట గొలిపే నెమలీకలం
శాంతి కపోతానికి స్నేహితులం
లక్ష్యం ఛేదించే చిరుతలం
                          "పిల్లలం"
బంగరు భవితకు బాటేసే బుడతలం
మేమే మేమే రేపటి భారత పౌరులం
భారతమాతకి ముద్దు బిడ్డలం
కీర్తి పతాకను నింగిన ఎగరేసే చిరు నవ్వులం
                          "పిల్లలం"